కలం, తెలంగాణ బ్యూరో: దివంగత ముఖ్యమంత్రి టి.అంజయ్య 40వ వర్ధంతి సందర్భంగా లుంబిని పార్క్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud) పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవ రావ్, వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ గవర్నర్ దత్తత్రేయ, మాజీ ఎంపీ కే వి పి రామ్ చందర్ రావ్, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు ఉన్నారు.
Also Read : ఏపీలో నారాసుర రక్తచరిత్ర : వైఎస్ జగన్
Follow Us On : WhatsApp

