ఆదిలాబాద్‌లో దసరా ఉత్సవాల కరపత్రాల ఆవిష్కరణ

కలం, ఆదిలాబాద్ : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అష్టమి తిథిని పురస్కరించుకుని సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా పండుగ కార్యక్రమాల కరపత్రాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Collector Rajarshi Shah) ఆదివారం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. వేద పండితులు ఉప్పల సంతోష్ శర్మ వేద పఠనం మధ్య కరపత్రాలను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సనాతన హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు కలెక్టర్‌కు అమ్మవారి చండీయాగ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రధాన కార్యదర్శి రేణికుంట రవీందర్, గౌరవ అధ్యక్షులు కందుల రవీందర్ మహిపాల్, ఊరాడే సుభాష్, విజయ్, రాజు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>