యాదగిరిగుట్ట ముద్దుబిడ్డకు న్యాయపీఠం.. జూనియర్ సివిల్ జడ్జిగా శ్రీవల్లి

కలం, యాదగిరిగుట్ట: కలలు కనడమే కాదు.. వాటిని సాకారం చేసుకునే వరకు కష్టపడితే విజయం తప్పక వరిస్తుందని యాదగిరిగుట్టకు చెందిన యువ న్యాయ ప్రతిభ పి.బి. శ్రీవల్లి (PB Srivalli) నిరూపించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, ఉన్నత విద్యను అభ్యసించి, న్యాయశాస్త్రంలో విశేష ప్రతిభ కనబరిచిన ఆమె.. తెలంగాణ జూనియర్ సివిల్ జడ్జి (జేసీజే) పోటీ పరీక్షల్లో విజయం సాధించి న్యాయమూర్తి పదవికి ఎంపికయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడం ఆమె పట్టుదలకు, క్రమశిక్షణకు, లక్ష్యసాధనపై ఉన్న నిబద్ధతకు నిదర్శనం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు గర్వకారణంగా నిలిచిన ఈ విజయం పట్టణ ప్రజల్లో ఆనందోత్సాహాలను నింపింది.

సాధారణ కుటుంబం.. అసాధారణ లక్ష్యం!

విజయం అనేది ఒక్కరోజులో దక్కే అదృష్టం కాదు.. ఏళ్ల తరబడి సాగించే కృషి, త్యాగం, నిరంతర సాధనకు లభించే ప్రతిఫలం. శ్రీవల్లి (PB Srivalli) విద్యా ప్రస్థానం దీనికి చక్కని ఉదాహరణ. న్యాయశాస్త్రంపై ఆసక్తిని లక్ష్యంగా మలుచుకున్న ఆమె, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధమైన ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లాలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. అనంతరం దేశంలోనే ప్రముఖ న్యాయ విద్యాసంస్థల్లో ఒకటైన నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్ లాలో ఎల్‌ఎల్‌ఎం పట్టా పొందారు. జాతీయ స్థాయిలో యూజీసీ-నెట్ అర్హత సాధించి తన విద్యా ప్రతిభను చాటుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>