కలం, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో తీవ్ర విషాదం (Gwalior Accident) చోటుచేసుకుంది. చినూర్ రోడ్డులోని ప్రసిద్ధ షీతలా మాత ఆలయ ప్రాంగణంలోకి వేగంగా వచ్చిన ఒక ట్రక్కు అదుపుతప్పి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆలయం వద్ద దైవదర్శనం కోసం వేచి ఉన్న భక్తులపైకి ఈ వాహనం దూసుకెళ్లడంతో ఘోర ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాద ధాటికి 12 మంది భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండగా, స్థానికులు వెంటనే స్పందించి వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

