కదులుతున్న కారుపై బీర్ తాగుతూ యువతి హల్‌చల్!

కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ప్రయత్నమో, మరే ఇతర కారణమో తెలియదు కానీ.. కొందరు బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. పబ్లిక్ ప్లేసులు, పార్కులు, రహదారులు అనే తేడా లేకుండా నిబంధనలు పట్టించుకోకుండా రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ప్రజల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి.

తాజాగా రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో (Turkayamjal) ఓ యువతి నడిరోడ్డుపై హల్‌చల్ చేసింది. కదులుతున్న కారు సన్ రూఫ్ తెరిచి పైకి ఎక్కి కూర్చుని, బీర్ తాగుతూ విన్యాసాలు చేసింది. రహదారిపై ఇతర వాహనాలు తిరుగుతున్న సమయంలో యువతి ఇలా వ్యవహరించడంపై వాహనదారులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువతి బీర్ తాగుతూ, హల్‌చల్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>