ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసంలో వైభవంగా ‘లక్ష పుష్పార్చన’

కలం, నిర్మల్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్ లో బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti ) నివాసంలో శనివారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వివిధ పుష్పాలతో అర్చన చేశారు. అమ్మవారిని పూలతో అలంకరించి భక్తిపారవశ్యంతో పూజలు నిర్వహించడంతో ఎమ్మెల్యే నివాసం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అమ్మవారి కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సతీమణి ఏలేటి కవితమ్మ మహిళలకు వాయినాలు అందజేశారు. అనంతరం అన్న ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సర్పంచులు, కౌన్సిలర్ లు, నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>