హైదరాబాద్‌లో నిరుద్యోగుల భారీ ఆందోళన

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయం (TGPSC Office) ముందు నిరుద్యోగులు భారీ ఆందోళన చేపట్టారు. టీజీపీఎస్సీ నిర్వహించే ఆర్అండ్‌బీ ఏఈఈ పరీక్ష, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిర్వహించే జేఈ పరీక్ష నవంబర్ ఆరో తేదీనే ఉన్నాయని చెప్పారు. ఒకే రోజు రెండు పరీక్షలు పెట్టడం వలన మరో పరీక్ష రాసే అవకాశం కోల్పోతున్నామని, తమకు అన్యాయం జరుగుతుందన్నారు.. వెంటనే టీజీపీఎస్సీ మరో తేదీలో ఏఈఈ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.

గత పది రోజులుగా ఈ విషయాన్ని టీజీపీఎస్సీ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిందే తక్కువ పోస్టులు.. అది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తేదీలోనే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. నిరుద్యోగుల ధర్నాతో నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు అభ్యర్థులకు సర్ది చెబుతున్నారు.

రీ షెడ్యూల్ చేయాలి: దాసోజు శ్రవణ్

ఒకే రోజు ఏఈఈ, జేఈ పరీక్షలు ఉండటంతో ఏదీ రాయాలో తేల్చుకోలేక నిరుద్యోగులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ (Dasoju Sravan Kumar) వివరించారు. రెండూ సివిల్ విద్యార్థులకే సంబంధించినవి కావడంతో వారి భవితవ్యం అయోమయంలో పడిందన్నారు. నోటిఫికేషన్లు రావడమే అరుదైపోతున్న సందర్భంలో ఒకే రోజు రెండు పరీక్షలు పెట్టడమంటే అభ్యర్థుల అవకాశాలను లాక్కోవడమే అన్నారు. టీజీపీఎస్సీ అధికారుల సమన్వయలోపం, సరైన ప్రణాళిక లేనట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో పరీక్ష క్యాలెండర్ ఖరారు చేసేటప్పుడు జాతీయ స్థాయి పరీక్షలను కూడా పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్ చేయాలన్నారు.

Also Read : ఇంటర్నెట్ పొందడం ప్రాథమిక హక్కు: సుప్రీం కోర్టు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>