కలం, అచ్చంపేట : నల్లమల లోతట్టు ప్రాంతంలో ఉన్న నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి (Vatavarlapalli) గ్రామంలో శనివారం మధ్యాహ్నం వర్షం కురిసింది. ఒకపక్క వర్షాలు కురవవని ప్రభుత్వం కంకణం కట్టుకొని ప్రచారం చేస్తుంటే, మరోపక్క నల్లమల అడవిలో ఉన్న కుగ్రామమైన వటవర్లపల్లి పరిసర ప్రాంతాల్లో వర్షం కురవడం వింతగా అనిపిస్తుంది. అంతేకాకుండా దేశమంతటా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంటుందని మీడియాలో, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు చర్చించుకుంటున్న వేళ, ఒక్కసారిగా ఆ గ్రామంలో వర్షం కురవడంతో ఊరంతా చల్లబడింది. గ్రామస్తులు, రైతులు దసరా పండుగ సందర్భంగా అమ్మవారి దీవెనలు తమ గ్రామంపై నిండుగా ఉన్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

