దుర్గామాత మండపాల్లో ఎమ్మెల్యే యెన్నం ప్రత్యేక పూజలు

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : రాష్ట్రంలోని ప్రజలు సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండేట్లు దీవించాలంటూ దుర్గామాతను స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యన్నం శ్రీనివాసరెడ్డి (MLA Yennam Srinivas Reddy) వేడుకున్నారు. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శనివారం శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా నగరంలోని పలు దుర్గామాత మండపాలతో (Durga Mata Mandapams) పాటు, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో కొలువైన దుర్గా మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నగరంలోని వివిధ మండపాల్లో ప్రతిష్ఠించిన దుర్గామాతను వారు దర్శించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు స్వీకరించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..దుర్గామాత ఆశీస్సులతో మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు.

ప్రజలందరూ ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో పండుగలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, కార్పొరేటర్ ప్రవీణ్ కుమార్, రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ రామకృష్ణయ్య, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ సుందరీకరణ కమిటీ అధ్యక్షుడు పోల శ్రీనివాస్, నాయకులు దోమ పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>