కలం, వెబ్ డెస్క్: జనసేన పార్టీ (Janasena Party) మున్సిపల్, మేయర్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ, ఏలూరు కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా రెడ్డి అప్పలనాయుడిని ఎంపిక చేసింది. 12 మున్సిపాలిటీలకు పేర్లను ప్రకటించింది. పిఠాపురం – డాక్టర్ బీరా విజయ్ శేఖర్, అమలాపురం – నల్లా శ్రీధర్, పుత్తూరు – డి. ఏలుమలై, చిలకలూరిపేట – తోట రాజరాజేశ్వరి, సామర్లకోట – పిట్టా జానకి రామారావు, గొల్లప్రోలు – కడారి తమ్మయ్య నాయుడు, నరసాపురం – కొత్తపల్లి శైలజ, నిడదవోలు – కల్లం జ్యోతి, పెడన – మట్టా శివపావని, సాలూరు – గొర్లె విజయకుమారి, తెనాలి – తోటకూర వెంకట రమణారావు, తిరువూరు – పి. మాధవిని ఎంపిక చేశారు. ఈ జాబితాకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆమోదముద్ర వేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read : కడపలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్ల దాడులు!
Follow Us On : WhatsApp

