కలం, తెలంగాణ బ్యూరో: ఎల్ నినో ఎఫెక్ట్ (El Nino Impact) ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నదని, దాని ప్రభావం ఎంతకాలం ఉంటుందో అంచనా వేయలేమని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని పిలుపునిచ్చారు. ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో తలెత్తనున్న నీటి ఎద్దడి, విద్యుత్ సంక్షోభంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి పిలుపునకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. శుక్రవారం ఓ సినిమా ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ.. విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు సినీ పరిశ్రమ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు.
ఎల్ నినో తీవ్రతను అర్థం చేసుకోవడానికి గత చరిత్రను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. 1876–1878 మధ్య వచ్చిన ‘సూపర్ ఎల్ నినో(Super El Nino)’ భారీ నష్టాన్ని మిగిల్చిందని, ఇలాంటి పరిస్థితులు సుమారు 150 ఏళ్లకు ఒకసారి మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రీయ ఆధారాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని నాగార్జున (Akkineni Nagarjuna) కోరారు.
Also Read : రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు ఇవ్వాలి: కవిత
Follow Us On : WhatsApp

