ఎంపీ మిథున్‌రెడ్డిపై కేసు నమోదు.. పుంగనూరులో హై అలర్ట్!

కలం, వెబ్ డెస్క్: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy)పై అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులపై కూడా కేసులు పెట్టారు. శుక్రవారం రోజున నామినేషన్ కేంద్రం వద్ద చోటు చేసుకున్న ఘటన చివరికి పరస్పర దాడుల వరకు వెళ్లింది. పదుల సంఖ్యలో కార్లు, బైకులు తగలబెట్టారు. దీనికి సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. సుమారు 70 మందిని ఇప్పటివరకు అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రోన్ విజువల్స్ ఆధారంగా నిన్న ఘటనలో పాల్గొన్నవారిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి సెర్చ్ చేస్తున్నారు. త్వరలోనే మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. నామినేషన్ల తొలి రోజు జరిగిన ఘటనను ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా పరిగణించింది.

భారీగా బలగాల మోహరింపు..

పుంగనూరులో చోటు చేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ముందు జాగ్రత్ చర్యగా భారీగా పోలీసులను మోహరించారు. 144 సెక్షన్ అమలు చేసి పుంగనూరు సహా చుట్టు పక్కల ప్రాంతాల్లో నిఘా పెంచారు. రాజకీయ నేతలు ఒక చోట గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. ఎంపీ మిథున్ రెడ్డి స్వయంగా నాయకులు, కార్యకర్తలను దాడులకు పురిగొల్పారని పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించిన వైసీపీ.. మొదట టీడీపీ నేతలే ఎంపీ కారుపై దాడి చేశారని ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>