కలం, వెబ్ డెస్క్: సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పెళ్లి (Kavya Anirudh Wedding) పీటలెక్కబోతున్నారు. నవంబర్ 21న చెన్నైలో నిర్వహించే రిసెప్షన్ వేడుకకు రావాలని ఆమె తండ్రి, సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసానికి చేరుకున్న కళానిధి మారన్ దంపతులు.. రేవంత్ రెడ్డి దంపతులను కలిశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కూడా కళానిధి మారన్ దంపతులు కలిసి రిసెప్షన్‌కు రావాలని కోరారు. అలాగే, హైదరాబాద్‌లో ఉన్న వివిధ రంగాల ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికలు అందించినట్లు సమాచారం.
గ్రీస్‌లో పెళ్లి.. చెన్నైలో రిసెప్షన్
కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారని కోలివుడ్ మీడియా ఎప్పటినుంచో కోడై కూస్తోంది. వీరిద్దరూ ఈ విషయాన్ని ఎప్పుడు ధ్రువీకరించలేదు. ఎన్నో ఇంటర్వ్యూల్లో అడిగినా.. ఇద్దరు తెలివిగా తప్పించుకుంటూ వచ్చారు. అయితే విదేశాల్లో వీరు కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో ఫ్యాన్స్ అందరికీ క్లారిటీ వచ్చేసింది. నవంబర్ 11న గ్రీస్‌లో పెళ్లి జరగబోతుంది. దీనికి అతి కొద్ది మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. నవంబర్ 21న చెన్నైలో భారీ రిసెప్షన్ వేడుక నిర్వహించబోతున్నారు. వీరిద్దరి పెళ్లికి సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంతో చొరవ తీసుకున్నారనే టాక్ కోలివుడ్ సర్కిళ్లలో గట్టిగా వినిపిస్తోంది.

