కలం, సోన్ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో సోన్ మండలం (Soan mandal) కడ్తాల్ గ్రామానికి చెందిన మామిళ్ల సహస్ర నృత్య ప్రదర్శన ఇచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమ్మవారి సన్నిధిలో నృత్య ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. భద్రకాళి ఆలయంలో ప్రదర్శన ఇవ్వడం పట్ల గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

