ముసలిమడుగులో విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శ్రీకారం

కలం, ఖమ్మం బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ అవసరాలను తీర్చడంతో పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించడమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలిమడుగులో (Musalimadugu) రూ.2.50 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం పనులకు పినపాక ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు(Payam Venkateswarlu) భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం కీలక ముందడుగు అని తెలిపారు. దీని ద్వారా ప్రజలకు, రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే ముసలిమడుగుతో పాటు పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, మండల అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>