పారా గేమ్స్‌కు భారత్ బిగ్ టీమ్

కలం, స్పోర్ట్స్ : జపాన్‌లో జరగనున్న ఆసియన్ పారా గేమ్స్‌ (Asian Para Games) కు భారత్ భారీ బృందంతో సిద్ధమైంది. 168 మంది అథ్లెట్లు 11 క్రీడల్లో పోటీపడనున్నారు. అక్టోబర్ 18 నుంచి 24 వరకు ఐచి-నగోయాలో ఈ క్రీడలు జరగనున్నాయి. అయితే కొన్ని క్రీడల పోటీలు అక్టోబర్ 16 నుంచే ప్రారంభమయ్యాయి. భారత జట్టులో 112 మంది పురుషులు, 56 మంది మహిళలు ఉన్నారు. జావెలిన్ త్రోలో సుమిత్ అంటిల్, ఆర్చరీలో శీతల్ దేవి, షూటింగ్‌లో అవని లేఖరా, బ్యాడ్మింటన్‌లో ప్రమోద్ భగత్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. భావినా పటేల్, సుహాస్ యతిరాజ్, నిషాద్ కుమార్, ప్రీతి పాల్ కూడా పోటీపడనున్నారు.

క్రీడల వారీగా చూస్తే.. పారా అథ్లెటిక్స్‌లో అత్యధికంగా 62 మంది, బ్యాడ్మింటన్‌లో 28 మంది, స్విమ్మింగ్‌లో 16 మంది, షూటింగ్‌లో 13 మంది బరిలోకి దిగనున్నారు. ఆర్చరీలో 11 మంది, బ్లైండ్ ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్‌లో పదేసి మంది పోటీపడతారు. పవర్‌లిఫ్టింగ్, జూడో, బోచ్చియా, సైక్లింగ్‌లోనూ భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటనున్నారు. ఫుల్ షెడ్యూల్ విషయానికి వస్తే.. అక్టోబర్ 16 నుంచి కొన్ని క్రీడల పోటీలు ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 17న మరికొన్ని విభాగాల పోటీలు జరగనున్నాయి.

అక్టోబర్ 18న ప్రారంభోత్సవం ఉంటుంది. అక్టోబర్ 19 నుంచి 23 వరకు అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, షూటింగ్ సహా పలు క్రీడల్లో పోటీలు కొనసాగుతాయి. అక్టోబర్ 24న ముగింపు వేడుకతో గేమ్స్ (Asian Para Games) ముగియనున్నాయి. 2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్‌లో భారత్ 111 పతకాలు సాధించింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలు ఉన్నాయి. ఈసారి ఆ రికార్డును మెరుగుపరచడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>