కలం, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో సానిటేషన్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న బుచ్చయ్య నూతన గృహప్రవేశ వేడుక శుక్రవారం ప్రశాంత వాతావరణంలో ఘనంగా జరిగింది. కిసాన్ నగర్ ప్రాంతంలో బుచ్చయ్య సొంతంగా నిర్మించుకున్న ఈ నూతన గృహ ప్రవేశ మహోత్సవానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్,యాదగిరి సునీల్ రావు (Sunil Rao) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ వేడుకలో భాగంగా యాదగిరి సునీల్ రావు, కార్మికుడు బుచ్చయ్య దంపతులను, వారి కుటుంబ సభ్యులను ప్రత్యక్షంగా కలసి శాలువాతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టపడి పనిచేసే మున్సిపల్ సానిటేషన్ కార్మికులు తమ సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్మికులు, బీజేపీ నాయకులు, కిసాన్ నగర్ కాలనీవాసులు పాల్గొని బుచ్చయ్య కుటుంబానికి శుభాకాంక్షలు అందించారు.

