తిరుమలలో భారీ వర్షం.. గ్యాలరీల్లో భక్తుల పడిగాపులు

కలం, వెబ్‌డెస్క్ : తిరుమలలో (Tirumala) భారీ వర్షం కురుస్తున్నప్పటికీ శ్రీవారి గరుడ వాహన సేవను(Garuda Vahana Seva) తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గ్యాలరీల్లో వేచి ఉంటూ స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. వర్షంతో పాటు చలి తీవ్రత పెరగడంతో గ్యాలరీల్లో ఉన్న మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా శ్రీవారి సేవకులు వేడి పాలు, బాదం పాలు అందిస్తున్నారు. సాయంత్రం 6:30 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనుండటంతో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

Also Read : ‘కిట్‌క్యాట్‌’లో పురుగులు.. క‌స్ట‌మ‌ర్ కంప్లైంట్‌!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>