కలం, వెబ్డెస్క్: దేవీ నవరాత్రుల వేళ ఓ ఆలయం గోపురంపై కోడిగుడ్లు పగిలి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad)లోని మెహిదీపట్నంలో ఉన్న శ్రీకనకదుర్గ ఆలయం (Kanaka Durga Temple) వద్ద చోటు చేసుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజూ ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కూడా పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి పూజల్లో పాల్గొన్నారు. ఈ సమయంలోనే గోపురంపై పగిలిన కోడిగుడ్లను గుర్తించారు. ఈ విషయాన్ని శ్రీకనకదుర్గా సేవా సమితి దృష్టికి తీసుకెళ్లారు. గుడి గోపురంపైనే కాకుండా ఆలయ ప్రాంగణంలో కూడా కోడి గుడ్లు పగిలిపోయి ఉన్నాయని భక్తులు వెల్లడించారు.
నేడు ఈ విషయం పలు హిందూ సంఘాలకు కూడా తెలిసింది. దీంతో భక్తులు, హిందూ సంఘాల నాయకులు ఆలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఆలయం వద్దకు చేరుకొని వారితో మాట్లాడారు. ఎలాంటి అనుచిత ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : రూ.1.50 కోట్ల కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా తాయమ్మ అమ్మవారు
Follow Us On: X(Twitter)

