భైంసా మార్కెట్ యార్డును పరిశీలించిన కలెక్టర్​ భవేశ్​ మిశ్రా

కలం, బైంసా: పంటల కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తూ, రైతులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శుక్రవారం భైంసా పట్టణంలోని మార్కెట్ యార్డును ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పంటల కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, రైతులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి కలెక్టర్​ అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ధాన్యం తూకంలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.

రైతులకు నష్టం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని భవేశ్​ మిశ్రా హెచ్చరించారు. అనంతరం పంటలు విక్రయించేందుకు వచ్చిన రైతులతో మాట్లాడిన కలెక్టర్.. కొనుగోలు ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన (Bhavesh Mishra) సూచించారు. రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని అధికారులను భవేశ్​ మిశ్రా ఆశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ శశిభూషణ్, సంబంధిత అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Also Read : పారా గేమ్స్‌ సెలక్షన్స్​పై వివాదం.. కోర్టుకెక్కిన చిరాగ్ బారేథా!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>