ప్రీతి రెడ్డి బతుకమ్మ వేడుకలపై విమ‌ర్శ‌లు

క‌లం, వెబ్‌డెస్క్: మేడ్చ‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి కోడ‌లు ప్రీతి రెడ్డి (Preeti Reddy) గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారారు. ప్రస్తుతం మల్లారెడ్డి విద్యా సంస్థల వైస్​ చైర్మన్​గా ఉన్న ఆమె అటు విద్యారంగంలో, ఇటు రాజకీయాల్లో, మరోవైపు పలు సినీ ఈవెంట్లతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా హైదరాబాద్​లోని మల్లారెడ్డి కాలేజీ (Mallareddy College)లో బతుకమ్మ వేడుకలు (Bathukamma Celebrations) నిర్వహించారు. ఈ వేడుకలకు సినీ హీరోయిన్​ శ్రీలీల, కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి భార్య కావ్య తదితర ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే ఈ వేడుకల్లో ప్రీతి రెడ్డి బతుకమ్మను అవమానించారంటూ సోషల్​ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రీతి రెడ్డి ఈ వేడుకల్లో బతుకమ్మ ముందు కొన్ని బాలీవుడ్​ స్పెషల్​ సాంగ్స్​కు స్టెప్పులు వేయడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, పవిత్రమైన ఇలాంటి వేడుకలో ఐటెం సాంగ్స్​కు డ్యాన్స్​ చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఏక్​ దో తీన్​ … అనే బాలీవుడ్​ సాంగ్​కు ప్రీతి రెడ్డి డ్యాన్స్​ చేసిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. బతుకమ్మ ముందు ఆమె అనుచిత హావభావాలతో సినిమా స్టెప్పులు వేస్తూ ప్రవర్తించారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వేడుకల్లో సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 65 అడుగుల ఎత్తుతో చేసిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతా బాగా జరిగిందని అనుకునే సమయంలో ప్రీతి రెడ్డి డ్యాన్స్​ వ్యవహారం విమర్శలకు దారి తీసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>