రేవంత్ రెడ్డి ‘ట్రేడ్ మార్క్’ అదే.. కవిత సంచలన ఆరోపణలు!

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) ఫైర్ అయ్యారు. ఎల్ నినో ప్రభావం, తీవ్ర కరువు పరిస్థితులపై పక్క రాష్ట్రాలు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి, కరువు మండలాలు ప్రకటించడమే కాకుండా కేంద్రానికి నివేదికలు పంపాయని ఆమె గుర్తుచేశారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తన అసహాయతను వ్యక్తపరుస్తూ, రైతులనే త్యాగాలు చేయాలని అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఒకవైపు ఆదివాసీ ఆడబిడ్డలు చనిపోతే కనీసం స్పందించని సీఎం.. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ పక్కన కూర్చుని రాజ్యాంగ విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.

ఈ సందర్భంగా వ్యవసాయ రంగాన్ని, రైతు కూలీలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు రైతు కూలీలకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం వెంటనే అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి దోపిడీలతో పాటు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో లంచాలు తీసుకోవడమే రేవంత్ రెడ్డి సర్కార్ ట్రేడ్ మార్క్‌గా మారిందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన పక్కనపెట్టి, రాష్ట్ర సంపదను తన కుటుంబ సభ్యులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు.

మంచినీటి పథకం మిషన్ భగీరథ మెయింటనెన్స్ సరిగ్గా జరగడం లేదని, ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని కవిత (Kalvakuntla Kavitha) ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డ బ్యారేజీని కూలగొట్టి మళ్లీ కడతారా? లేక ఏం చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని నిలదీశారు. గత ప్రభుత్వంపై విమర్శలతో కాలయాపన చేయడం ఆపి నిర్మాణాత్మక పనులు ప్రారంభించాలని హితవు పలికారు. అంతేకాకుండా, హైదరాబాద్ నగరంలో దాదాపు 8 వేల చెరువులు మాయమైనట్లు కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు.

మరోవైపు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌(Yadadri Power Plant)ను ప్రైవేటీకరించేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని కవిత ఆరోపించారు. రాష్ట్రంలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలు, తాజా పరిస్థితులపై తమ పార్టీ తరఫున కేంద్ర మంత్రులను కలసి విన్నవిస్తామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తిట్లు బంద్ చేసి, ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.

Also Read : తెలంగాణ విద్యుత్తు డిమాండ్‌లో సరికొత్త రికార్డు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>