ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఉద్యోగులు

కలం, నిర్మల్:  జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు (NHM Employees) శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(MLA Alleti Maheshwar Reddy)ని కలిశారు. ఈ సందర్భంగా వారు తమ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. అంతేకాక తెలంగాణలో గత రెండు దశాబ్దాలుగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలకంగా పనిచేస్తున్నప్పటికీ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేస్తామని గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేయాలని వారు కోరారు. ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వారి అభ్యర్థనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారానికి సహకరించాలని ఉద్యోగులు ఎమ్మెల్యేను కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>