కలం, నిర్మల్ రూరల్ : నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ (Vengwapet) గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం (Primary Health Sub-Centre) నూతన భవనాన్ని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా నిర్మించిన ఈ భవనంతో గ్రామస్తులకు వైద్య సేవలు మరింత చేరువ కానున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాద వనిత, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్, బీజేపీ నాయకులు జమాల్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

