కలం, వెబ్ డెస్క్: ఏపీలోని స్థానిక ఎన్నికల (Local Body Elections) సమరం ముందర పార్వతీపురం మన్యం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన మాజీ ఎమ్మెల్సీ, మాజీ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ (Dwarapureddy Jagadish) జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు సమక్షంలో జగదీష్ తన అనుచర గణంతో కలిసి జనసేన పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా నాగబాబు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
కాగా, మున్సిపల్ ఎన్నికల సీట్ల సర్దుబాటులో భాగంగా పార్వతీపురం మున్సిపల్ ఛైర్మన్ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభావవంతమైన మాజీ ఎమ్మెల్సీ జగదీష్ (Dwarapureddy Jagadish) తన అనుచర గణంతో జనసేనలో చేరినట్లు సమాచారం అందుతోంది. ఏది ఏమైనా ద్వారపురెడ్డి జగదీష్ రాకతో పార్వతీపురం ప్రాంతంలో జనసేన ప్రాబల్యం మరింత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read : ఏలూరులో సొంత పార్టీపై తిరగబడ్డ టీడీపీ నేతలు!
Follow Us On: Youtube

