గంగుల పోరాటంతో రూరల్‌ మండలానికి సాగునీరు

కలం, కరీంనగర్‌ రూరల్‌: సాగునీరు (Irrigation Water) కోసం మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చేసిన పోరాటం ఫలించడంతో రూరల్‌ మండలానికి నీరు చేరింది. దీంతో నగునూరు, ఇరుకుల్ల గ్రామాలకు చెందిన రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. డీ-86 కెనాల్‌ వద్ద నీటిలోకి దిగి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా రైతులు, స్థానిక నాయకులు మాట్లాడుతూ.. పంటలు ఎండిపోయే దశలో సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన గంగుల కమలాకర్‌ స్వయంగా చొప్పదండికి వెళ్లి రెగ్యులేటర్‌ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయించారని తెలిపారు.

ఆయన చొరవతోనే రూరల్‌ మండలానికి సాగునీరు అందిందని పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న గంగుల (MLA Gangula Kamalakar) సేవలను మరువలేమని అన్నారు. సాగునీరుఅందడంతో పంటలను కాపాడుకునే అవకాశం కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన నిలిచి సాగునీటి కోసం పోరాడిన ఎమ్మెల్యేకు రైతులు, బీఆర్‌ఎస్‌ శ్రేణులు కృతజ్ఞతలు తెలిపారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>