గంగపుత్రుల ఉపాధి బోట్లను ప్రారంభించిన ఎమ్మెల్యే పటేల్

కలం, బాసర: గత 25 నెలలుగా బాసర గోదావరి నదిలో నిలిచిపోయిన గంగపుత్రుల ఉపాధి బోట్ల (Gangaputra Boats) ను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శుక్రవారం ప్రారంభించారు. దీంతో బాసరలో బోట్లపై ఆధారపడి జీవిస్తున్న 60 గంగపుత్రుల కుటుంబాలకు తిరిగి ఉపాధి లభించింది. గోదావరి నదిలో బోట్లు నిలిచిపోవడంతో ఉపాధి కోల్పోయిన గంగపుత్రుల కుటుంబాలు గత రెండేళ్లకు పైగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

తమ సమస్యను పరిష్కరించి బోట్ల నిర్వహణకు అనుమతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు ఎమ్మెల్యే (MLA Pawar Ramarao Patel) దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడి బోట్లు తిరిగి ప్రారంభమయ్యేలా కృషి చేశారు. దీంతో 25 నెలల తర్వాత తమ జీవనోపాధి తిరిగి ప్రారంభం కావడంపై గంగపుత్రుల కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాసర మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, బీజేపీ నాయకులు, గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Also Read : అమెరికా మంత్రి పర్యటన.. మోదీపై రాహుల్ సెటైర్లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>