కేంద్రం కీలక నిర్ణయం..పెట్రోల్ ఎగుమతి సుంకం పెంపు!

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం దేశీయ ఇంధన రంగంలో కీలక నిర్ణయం తీసుకుంటూ పెట్రోల్ ఎగుమతులపై విండ్ఫాల్ పన్ను (Windfall Tax)ను పెంచింది. లీటరు పెట్రోల్ ఎగుమతిపై సుంకాన్ని ఏకంగా రూ.2.50 మేర పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త పన్ను నిబంధనలు అక్టోబర్ 16 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తాయని అధికారిక ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, దిగుమతి-ఎగుమతుల సమీకరణాల ఆధారంగా కేంద్రం ఎప్పటికప్పుడు ఈ విండ్ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ రేట్లను సవరిస్తుంటుంది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇంధన ఎగుమతిదారులపై భారం పడనుండగా, దీని ప్రభావం పరోక్షంగా దేశీయ మార్కెట్, చమురు కంపెనీల లాభాలపై పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

డీజిల్ పై తగ్గింపు..

పెట్రోల్ ఎగుమతి సుంకాన్ని పెంచిన కేంద్ర ప్రభుత్వం, డీజిల్ ఎగుమతులపై విధించే విండ్ఫాల్ పన్నును మాత్రం భారీగా తగ్గించింది. డీజిల్ ఎగుమతిపై ఉన్న ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని (SAED) లీటరుకు రూ.16 నుంచి ఏకంగా రూ. 8.50కి కుదించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>