ధరూర్ పోలీస్ స్టేషన్ బాధితుడు వీరేష్ మృతి

కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ (Dharur) మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వీరేష్(28) అనే యువకుడు శుక్రవారం తెల్లవారుజామున కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. న్యాయం కోసం ధరూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనపై పోలీసులు దాడి చేసి అవమానించారని మనస్తాపం చెంది, ఈ నెల 9న వీరేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మెరుగైన వైద్యం కోసం అతడిని కర్నూల్ ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు. తమ కుమారుడి మృతికి ధరూర్ పోలీసుల వేధింపులే కాకుండా రాజకీయ కక్షలే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>