నిర్మల్ లో ఎమ్మెల్యే ఏలేటి పర్యటన

కలం, నిర్మల్ : నిర్మల్ నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (Maheshwar Reddy) పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఉదయం 10 గంటలకు నిర్మల్ పట్టణంలోని గాజులపేట్‌లో రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు నిర్మల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ సబ్‌సెంటర్ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సారంగాపూర్ మండలం ఆలూరు గ్రామం నుంచి ధని వరకు సీఆర్ఆర్ నిధులతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>