కలం, నిర్మల్: సోన్ మండలం కడ్తాల్ (Kadthal) గ్రామంలోని రామాలయంలో ప్రతిష్టించిన దుర్గామాత వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 16వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రాత్రి దుర్గామాత బోనాల జాతర నిర్వహించారు. కొత్త కుండలో తయారుచేసిన నైవేద్యాన్ని భాజాభజంత్రీల నడుమ మహిళలు బోనాలను గ్రామ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దుర్గమాత అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

