కలం, వెబ్ డెస్క్ : ఎల్ నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సచివాలయంలో ఎల్ నినో పరిస్థితిపై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019-20లో కోవిడ్తో ప్రపంచమే స్తంభించిపోయిందని, ఇప్పుడు అలాంటి మరో సంక్షోభం ఎదురవుతోందని సీఎం వెల్లడించారు.
ఎల్నినో (El Nino) ప్రభావం అన్ని జీవరాశులపై పడిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాగునీటికి సైతం క్లిష్టమైన పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిందని, ఉత్పత్తి మాత్రం తగ్గిందని సీఎం అన్నారు. రాష్ట్రంలో మార్చిలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే నమోదవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని సీఎం స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో 14 వేల మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా అది నేడు 20 వేల మెగా వాట్లకు పెరిగిందని రేవంత్ రెడ్డి చెప్పారు. చేతికందిన పంటలు నష్టపోవద్దనే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. రిజర్వాయర్లలో 72 శాతం నీటి లభ్యత పడిపోయిందన్నారు. సాగు నీళ్లకు ఇస్తే తాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతాయని ముఖ్యమంత్రి (Revanth Reddy) చెప్పారు.
Also Read : ట్యాంకర్ నీళ్లతో పంటను కాపాడుకుంటున్న రైతు!
Follow Us On: Youtube

