భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆసుపత్రులు భేష్.. 6 అవార్డులతో రికార్డు

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులు కాయకల్ప్ అవార్డుల్లో అద్భుత ప్రతిభను కనబర్చాయి. నాణ్యతా ప్రమాణాల పరిశీలనలో భాగంగా ఐదు ఆసుపత్రులు అవార్డులు దక్కించుకుని, రాష్ట్రంలోనే రికార్డు సృష్టించాయి. గురువారం కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఈ అవార్డులను ప్రకటించారు. అలాగే పాల్వంచ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రాష్ట్రస్థాయి ‘ఎకో ఫ్రెండ్లీ’ అవార్డుతోపాటు మరో కమెండేషన్ అవార్డు లభించింది. భద్రాచలం, ఇల్లెందు, అశ్వారావుపేట, మణుగూరు ఏరియా ఆసుపత్రులకు కమెండేషన్ అవార్డులు దక్కాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఎకో ఫ్రెండ్లీ విభాగంలో ప్రకటించిన ఏకైక రాష్ట్ర అవార్డు పాల్వంచకే దక్కడం విశేషం. అలాగే, తొలిసారి పరిశీలనకు వెళ్లిన మణుగూరు, అశ్వారావుపేట ఆసుపత్రులు కూడా అవార్డులు సాధించడం జిల్లా TVVP చరిత్రలో కొత్త అధ్యాయంగా నిలిచింది. గత ప్రస్తుత​ కలెక్టర్ల సహకారం, డీసీహెచ్‌ఎస్ జి. రవిబాబు సమన్వయం సిబ్బంది సమష్టి కృషితోనే ఈ ఘనత సాధ్యమైందని అధికారులు తెలిపారు. భద్రాచలం ఆస్పత్రిని త్వరలో అంతర్జాతీయ స్థాయి ఐఎస్‌ఓ (ISO) సర్టిఫికేషన్ వైపు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మొత్తం 6 అవార్డుల ద్వారా జిల్లాకు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ లభించనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>