కలం, జోగులాంబ గద్వాల: ధరూర్ మండలంలోని పార్చర్ల (Parcharla) స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ప్రరమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ముగ్గురు గాయపడ్డారు. ధరూర్ మండలం గూడెందొడ్డి గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబ సభ్యులందరూ కలిసి గురువారం మధ్యాహ్నం ఆటోలో గద్వాలకు బయలుదేరారు. మార్గమధ్యలో పార్చర్ల స్టేజ్, గోనుపాడు రైస్ మిల్లు మధ్య ప్రమాదవశాత్తు ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పావని (28) అనే మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా, మృతురాలి మూడేండ్ల కూతురు గాయపడటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.

