రైతుల సంక్షేమానికి కట్టుబడ్డ ప్రజా ప్రభుత్వం : బాలు నాయక్

కలం, దేవరకొండ : వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలు తగ్గుతున్న తరుణంలో రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ (MLA Balu Naik) సూచించారు. గురువారం నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని రైతువేదికలో వ్యవసాయ శాఖ, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు రాయితీ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతు భరోసా, రుణమాఫీ, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు వ్యయం తగ్గి, నష్టాల నుంచి గట్టెక్కవచ్చని తెలిపారు. ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి కొరత ఏర్పడుతున్నందున, అధిక నీరు అవసరమయ్యే వరి పంటకు బదులుగా వేరుశనగ, మినుములు, పెసర, జొన్న వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని ఎమ్మెల్యే (MLA Balu Naik) కోరారు.

నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ సలహాలు నిరంతరం అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు కూడా విత్తన శుద్ధి, సరియైన ఎరువుల వాడకం, తెగుళ్ల నివారణలో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. దేవరకొండ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంటల సాగు విధానాలు, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో నాయకులు దొంతం అలివేలు సంజీవరెడ్డి, జటావత్ హరినాయక్, కొండూరి పవన్ కుమార్, ముచ్చర్ల గిరి, ఎరుకల వెంకటయ్య గౌడ్, లింగంపల్లి వెంకటయ్య, దాసరి శ్రీనివాస్ యాదవ్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>