2028 ఒలింపిక్స్‌లో మ‌రిన్ని ప‌త‌కాలు సాధిస్తాం: మోదీ

క‌లం, వెబ్‌డెస్క్‌: జ‌పాన్‌లోని ఐచి న‌గోయాలో జ‌రిగిన‌ అంతర్జాతీయ ఆసియా గేమ్స్‌ (Asian Games)లో పాల్గొన్న భార‌త క్రీడాకారుల‌తో ప్ర‌ధాని మోదీ (PM Modi) నేడు ఢిల్లీలో స‌మావేశ‌మ‌య్యారు. ప‌త‌కాలు సాధించిన క్రీడాకారుల‌ను అభినందించి స‌త్క‌రించారు. ఆసియా క్రీడ‌ల్లో భార‌త క్రీడాకారులు స‌త్తా చాటార‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ ఏడాది దేశానికి 85 ప‌త‌కాలు రావ‌డం ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ నాలుగో స్థానంలో నిలిచింద‌ని తెలిపారు. దేశానికి 21 స్వ‌ర్ణ‌, 27 ర‌జ‌త‌, 37 కాంస్య ప‌త‌కాలు వ‌చ్చాయ‌న్నారు. ఇది ఆరంభం మాత్ర‌మేన‌ని, రానున్న రోజుల్లో 2028 ఒలింపిక్స్‌లో భార‌త్ మ‌రిన్ని ప‌త‌కాలు సాధిస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఆసియా క్రీడ‌ల్ల కొన్ని ప‌త‌కాల‌ను ప్ర‌ధాని మోదీ (PM Modi) ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మిక్స్‌డ్ మార్ష‌ల్ ఆర్ట్స్ లాంటి క్రీడ‌ల్లో మొద‌టి సారి స్వ‌ర్ణం సాధించార‌న్నారు. అలాగే వెయిట్ లిఫ్టింగ్‌లో 28 ఏళ్ల త‌ర్వాత గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చింద‌ని తెలిపారు. మొత్తం 85 ప‌త‌కాల్లో మ‌హిళా అథ్లెట్లు 11 గోల్డ్ మెడ‌ల్స్ సాధించార‌ని చెప్తూ, వారిని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఇదే వేదిక‌పై మోదీ మేజ‌ర్ ధ్యాన్ చంద్ సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. హాకీకి ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌న్నారు. ధ్యాన్ చంద్ రోజులు, నెల‌ల త‌ర‌బ‌డి గ్రౌండ్‌లో ఎంతో క‌ష్ట‌ప‌డేవార‌ని చెప్పారు. ఇక క్రికెట్‌లో కూడా వ‌రుస‌గా ప‌త‌కాలు వ‌చ్చాయ‌ని మోదీ తెలిపారు.

Also Read : రష్యా అమ్మాయి, బీహార్​ అబ్బాయి.. అసలు స్టోరీ ఇదే!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>