కలం, వెబ్ డెస్క్ : ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) ముమ్మరం చేస్తున్నా అవినీతి అధికారుల తీరు మారడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలోని మాదన్నపేటలో ఓ విద్యుత్ శాఖ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఆరు విద్యుత్ మీటర్ల కోసం TGSPDCL సెక్షన్ అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) రాకేశ్ రూ.1.20 లక్షలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. గురువారం బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటున్న ఏఈ ని అవినీతి శాఖ అధికారులు పట్టుకున్నారు.

