ఎవరీ గరివిడి లక్ష్మి..? ఆమె పాటలకు ఎందుకంత క్రేజ్!

కలం, వెబ్ డెస్క్: ఆనంది ప్రధాన పాత్రలో గరివిడి లక్ష్మి (Garividi Lakshmi) మూవీ త్వరలో రీలీజ్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రీమియర్స్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. అక్టోబర్ 17న థియేటర్స్‌లో విడుదల కానున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్ ఉంది. ఉత్తరాంధ్ర పాటలు, గరివిడి లక్ష్మి జర్నీ అద్భుతంగా చూపించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ ఆనంది లక్ష్మీ పాత్రలో ఇట్టే ఒదిగిపోయారు. రాగ్ మయూర్, షకలక శంకర్ వారి పాత్రల్లో జీవం పోశారు.

ఎవరీ గరివిడి లక్ష్మి

1990ల్లో తన బుర్రకథ ప్రదర్శనలతో ఆంధ్రప్రదేశ్‌ను ఉర్రూతలూగించిన కళాకారిణి గరివిడి లక్ష్మి. ఉత్తరాంధ్రకు చెందిన ఆమె అసలు పేరు రెడ్డి విజయలక్ష్మి. ‘మందులోడా.. ఓరి మాయలోడా’, ‘మాలవారి మంగమ్మ’, ‘కోసింది కోయగూర’ లాంటి పాటలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సుమారు 10 వేలకుపైగా ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకులను అలరించారు. 1990 దశకంలో తన పాటలు, ప్రదర్శనలతో ఉమ్మడి ఏపీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న కళారంగాన్ని ఎంచుకుని ఆమె రాణించారు. సామాజిక సమస్యలపై స్పందిస్తూ గ్రామీణ ప్రజలకు దగ్గరైంది. ఇప్పుడు ఆమె జీవిత కథ ఆధారంగా ‘గరివిడి లక్ష్మి’ తెరకెక్కింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>