నిర్మల్‌లో NHM ఉద్యోగుల వంటావార్పు.. కీలక డిమాండ్లు

కలం, నిర్మల్: జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులు (NHM Employees) తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరవధిక సమ్మె (Protest) కొనసాగుతోంది. గురువారం నిర్మల్‌ (Nirmal) జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు, ఆయుష్‌ వైద్యులు వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సర్వీసుల క్రమబద్ధీకరణ పూర్తయ్యే వరకు 100 శాతం గ్రాస్‌ శాలరీ చెల్లించాలని కోరారు. ఉద్యోగ భద్రతతోపాటు ఆరోగ్య భద్రత కల్పించాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>