అడెల్లి పోచమ్మ జాతరకు భారీ ఏర్పాట్లు.. పోస్టర్లు విడుదల

కలం, దిలావర్‌పూర్: అడెల్లి శ్రీ మహా పోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతర (Adelli Jatara) ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం దిలావర్‌పూర్ మండలం సాంగ్వి గ్రామ పంచాయతీ కార్యాలయంలో జాతర పోస్టర్లను డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ కృష్ణ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. శనివారం సాయంత్రం అమ్మవారి ఆభరణాలతో గ్రామానికి వేలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు జాతరను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. అనంతరం అమ్మవారి ఆభరణాలను శుద్ధి చేసే ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవీందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Also Read : రాహుల్ గాంధీపై సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>