కలం, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్‌లో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న గోపి (AR SI Gopi) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన హఠాన్మరణం పోలీసు శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుజిలితండాకు చెందిన గోపి 2013లో కానిస్టేబుల్‌గా పోలీసు శాఖలో చేరారు. విధి నిర్వహణలో చూపిన నిబద్ధత, అంకితభావంతో హెడ్ కానిస్టేబుల్‌గా, ఆ తర్వాత ఏఆర్ ఎస్ఐగా పదోన్నతులు పొందారు.
వీఐపీ భద్రత, ఎన్నికల విధులు వంటి కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించిన ఆయన, తన అత్యుత్తమ సేవలకు గాను 14 రివార్డులు అందుకున్నారు. గోపి (AR SI Gopi) మృతిపై సహచర పోలీసులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక సాధారణ కానిస్టేబుల్‌గా చేరి ఎస్ఐ స్థాయికి ఎదిగిన గోపి సేవలు పోలీసు శాఖకు ఆదర్శనీయమని నివాళులర్పించారు.
Also Read : ఐఏఎస్‌లకు యాదాద్రి ప్లాంట్ పర్యవేక్షణ బాధ్యత
Follow Us On: X(Twitter)

