కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తప్పులు చేస్తూ.. అధికారులపై నిందలు వేయడం అలవాటుగా మార్చుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్తు సరఫరా చేయకపోతే అధికారుల ఉద్యోగాలు ఊడుతాయంటూ హెచ్చరిస్తున్న ముఖ్యమంత్రి.. ప్రజలు, అధికారులు ఆయన ఉద్యోగం ఊడగొట్టకుండా చూసుకోవాలని హితవు పలికారు. బొగ్గు నిల్వలు కూడా పెట్టుకోకుండా విద్యుత్తు సంక్షోభానికి కారణమైందని ముఖ్యమంత్రి కాదా.. అని ప్రశ్నించారు. సమీక్షలు చేయకుండా, విద్యుత్తు రంగాన్ని గాలికొదిలేసి.. కరెంట్ కోతలకు కారణమయ్యారని మండిపడ్డారు.
సీఎం రేవంత్ మొద్దు నిద్ర..
ఎల్ నినో (El Nino) ప్రభావం గురించి గత 9 నెలలుగా వాతావరణ శాఖ, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నా.. సీఎం రేవంత్ రెడ్డి మొద్దు నిద్రలో ఉన్నారని హరీశ్ రావు (Harish Rao) ఎద్దేవా చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు.. ఇప్పుడు నిద్ర లేచి అధికారులను సస్పెండ్ చేస్తానంటూ బెదిరిస్తే ఏం లాభం అన్నారు. నిషేధిత భూముల విషయంలో కూడా ప్రభుత్వమే తప్పు చేసి.. అధికారులపై నెపం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఎల్ నినో, కొవిడ్ కంటే కాంగ్రెస్ పాలనే పెద్ద విపత్తుగా మారిందనే విషయాన్ని గుర్తించడం లేదన్నారు.
Also Read : బీఆర్ఎస్లో కలకలం.. సిద్ధిపేట వేదికగా ఫొటో వార్!
Follow Us On: X(Twitter)

