శాకంబరీ ఆలయాన్ని సందర్శించిన రాజర్షిషా

కలం, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కాలనీలోని ప్రముఖ పురాతన శాకంబరీ ఆలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ పూజా కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వేనుగంటి ప్రకాష్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, ప్రముఖులు ప్రవీణ్ చతుర్వేది, మాజీ కౌన్సిలర్ గోనెల చిన్నస్వామి, ఎన్నవార్ కృష్ణ, మాధస్తు సంతోష్, అనిల్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>