కలం, నిర్మల్: సోన్ మండలం గంజాల్ టోల్ప్లాజా (Gamjal Toll Plaza) వద్ద రవాణాశాఖ అధికారులు బుధవారం రాత్రి ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఎంవీఐలు దూప్సింగ్, తిరుపతి ఆధ్వర్యంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు (Private Travel Bus), లారీల పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్లు, పన్నుల చెల్లింపులు, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును అధికారులు సీజ్ చేశారు. 11 వాహనాలకు అపరాధ రుసుము విధించారు. ఈ తనిఖీల్లో ఏఎంవీఐలు రానాశ్రీ, అక్షయ్, రజనీకాంత్, సిబ్బంది లిఖిత్, నరేష్, కార్తీక్ పాల్గొన్నారు.

