కేటీఆర్‌ సీఎం నినాదాలు.. గజ్వేల్‌లో రాజకీయ చర్చ

కలం, మెదక్ జిల్లా : గోదావరిఖనిలో నిర్వహించే సింగరేణి బహిరంగ సభకు రాజీవ్ రహదారి మీదుగా వెళ్తున్న బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు (KTR) గజ్వేల్ నియోజకవర్గంలోని రిమ్మనగూడ (Rimmanaguda) వద్ద స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉత్సాహంగా కేటీఆర్‌ను ఉద్దేశించి “సీఎం.. సీఎం..” అంటూ నినాదాలు (CM Slogans) చేశారు. అనంతరం కేటీఆర్ కొద్దిసేపు గజ్వేల్ నియోజకవర్గ నాయకులతో మాట్లాడి సభకు బయలుదేరి వెళ్లారు.

ప్రస్తుతం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోనే బీఆర్‌ఎస్ కార్యకర్తలు కేటీఆర్‌ను “సీఎం.. సీఎం..” అంటూ నినదించడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్‌కు స్వాగతం పలికిన వారిలో మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>