ఆధార్ అప్‌డేట్‌కు ప్రత్యేక క్యాంపులు.. డీఈఓ ప్రకటన

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం ఈ దసరా సెలవుల్లో ప్రత్యేక ఆధార్ నమోదు, అప్‌డేట్ క్యాంపులను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి (Khammam DEO) డి. వాసంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ప్రత్యేక క్యాంపులలో నూతన ఆధార్ నమోదుతో పాటు, విద్యార్థులకు అత్యంత కీలకమైన పెండింగ్ బయోమెట్రిక్ అప్‌డేట్లు, సాధారణ ప్రజలకు అవసరమైన ఇతర ఆధార్ సేవలు అందించబడతాయని తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు పరస్పరం సమన్వయం చేసుకుంటూ, పెండింగ్ బయోమెట్రిక్ అప్‌డేట్లు ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని చేరవేసి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రోత్సహించాలని జిల్లా విద్యాధికారిణి ఆదేశించారు. ఆధార్ సేవల కొరకు యుఐడిఎఐ నిర్ణయించిన ప్రామాణిక నిబంధనల ప్రకారమే రుసుములు వసూలు చేయాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>