టీటీడీ కల్తీ నెయ్యి కేసు.. రూ.130 కోట్ల ఆస్తులు అటాచ్

కలం, వెబ్ డెస్క్: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం (TTD ghee case) కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై చర్యలు వేగవంతం చేసిన ఈడీ.. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ -2002 కింద నిందితులకు చెందిన రూ.130 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల్లో భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, సుకృతి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో పాటు వాటి ప్రమోటర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, వారి ఫ్యామిలీకి చెందిన ఆస్తులు ఉన్నాయి.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పలు కీలక పరిణామాల అనంతరం ఈ కేసుపై విచారణ చేపట్టిన ఈడీ.. భోలే బాబా డెయిరీ ద్వారా టీటీడీకి మొత్తం రూ.234.5 కోట్ల విలువైన కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు తేల్చింది.  రసాయనాలు, పామాయిల్ మిశ్రమంతో నకిలీ నెయ్యి తయారు చేసినట్లు గుర్తించింది. ఈ కేసులో గతంలో 6 రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రూ.2.7కోట్ల నగదును సీజ్ చేయడంతో పాటు బ్యాంకు నిల్వలను ఫ్రీజ్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే విపిన్ జైన్, కైలాష్ చంద్ర మంగ్లాలను అరెస్ట్ చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>