NHM ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి: ఏఐవైఎఫ్

కలం, కరీంనగర్: ఎన్‌‌హెచ్‌ఎం ఉద్యోగుల ప్రధాన సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు చేస్తున్న నిరసన దీక్షా శిబిరాన్ని బుధవారం ఏఐవైఎఫ్ (AIYF) నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి యుగంధర్ మాట్లాడుతూ.. ఎన్‌‌హెచ్‌ఎం ఉద్యోగులందరినీ (NHM Employees) వెంటనే పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలను పెంచాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ (ESI) సౌకర్యాలు కల్పించి ఆదుకోవాలని ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా సౌకర్యం, ప్రతి నెలా నిర్ణీత తేదీన జీతాలు చెల్లించాలని యుగంధర్ అన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేసి ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు, ప్రసూతి సెలవులు ఇవ్వాలని కోరారు.

ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఉద్యోగుల సర్వీసుకు తగిన పదోన్నతులు కల్పించాలని యుగంధర్ కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించాలని పేర్కొన్నారు. ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే యూనియన్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు జువ్వాజి తిరుపతి, డాక్టర్ శ్రావణి, సౌమ్య, సంధ్యారాణి, డాక్టర్ పుల్లారావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>