తాలిపేరు నదిలో ఇంటర్ విద్యార్థి గల్లంతు

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల (Charla Tragedy) మండలంలోని తేగడ సమీపంలో ఉన్న తాలిపేరు నదిలో (Taliperu River) బుధవారం ఇంటర్ విద్యార్థి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో పలువురు భక్తులు భవానీ మాలలు ధరించారు. ఈ క్రమంలో మాలధారులతో కలిసి తేగడ సమీపంలోని తాలిపేరు నదికి వెళ్లిన దజ్జుపల్లి బాబి (15) అనే యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. బాబి చర్లలోని మునిగిగొల్లగట్ట ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దసరా శరన్నవరాత్రి వేడుకల వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>