ప్రజల అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా

కలం, నిర్మల్ : జిల్లా కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల్లో ఫైళ్లను పెండింగ్‌లో ఉంచకుండా, సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పెండింగ్‌ ఫైళ్లు, ప్రజల నుంచి అందిన వినతుల పరిష్కారంపై ఆయన సమీక్షించారు. సెక్షన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజల నుంచి అందిన అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసర జాప్యం చేయకూడదని స్పష్టం చేశారు. ప్రతి సెక్షన్‌లో ఫైళ్ల పురోగతిని సూపరింటెండెంట్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యాలయ పరిపాలనలో పారదర్శకతను పెంపొందిస్తూ, ఫైళ్ల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్​ (Bhavesh Mishra) తెలిపారు.

అధికారులు, సిబ్బంది విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, సకాలంలో అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఏ ఓ ప్రవీణ్, సెక్షన్ సూపరింటెండెంట్లు స్వాతి, సంధ్య, మల్లేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>